బ్రయోనా టేలర్ హత్య కేసులో లూయిస్‌విల్లే పోలీసులపై క్రిమినల్ నేరాన్ని మోపక పోవడాన్ని నిరసిస్తూ అమెరికాలోని పలు నగరాల్లో ఆందోళనలు చెలరేగాయి. న్యూయార్క్ సహా చికాగో, వాషింగ్టన్, అట్లాంటా, ఫిలాన్‌డెల్ఫియా, లూయిస్విల్లేలలో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు.
భారీగా ఆందోళనల్లో పాల్గొన్న నిరసనకారులు టేలర్ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ నిరసనకారులు ఆందోళన చేశారు. లూయిస్‌విల్లేలో జరిగిన అల్లర్లలో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వీరిద్దరూ ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు తెలిపిన అధికారులు... ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
పెద్దఎత్తున ర్యాలీగా వెళ్తున్న ఆందోళనకారులు మార్చి13న ఘటన..
వైద్యసిబ్బందిగా పనిచేస్తోన్న నల్లజాతీయురాలైన టేలర్... మార్చి 13న తన ఇంట్లోనే లూయిస్‌విల్లే పోలీసుల కాల్పుల్లో మరణించింది. మాదకద్రవ్యాల విచారణ కోసం బ్రయోనా టేలర్ ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు చేసిన కాల్పుల్లో ఆమె చనిపోయింది. దీనిపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ కేసును విచారించిన కెంటుకీ గ్రాండ్ జ్యూరీ... టేలర్ స్నేహితుడు కాల్పులు జరపడం వల్ల ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో బ్రయోనా టేలర్ చనిపోయిందంటూ పోలీసులపై క్రిమినల్ నేరాన్ని మోపకుండా తీర్పు ఇచ్చింది. అనుకోకుండా జరిగిన ఘటనగా పరిగణిస్తూ కాల్పులు జరిపిన అధికారిపై స్వల్ప జరిమానా విధించారు. దీనిని నిరసిస్తూ ఆందోళనలు చెలరేగాయి.
ఇదీ చూడండి:ఇసుక తిన్నెల్లో చిక్కుకొని వందలాది తిమింగలాలు మృతి