అమెరికాలో కాల్పుల మోత కలకలం రేపింది. శని, ఆదివారాల్లో సెయింట్ లూసియాలో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అమెరికాలో కాల్పుల మోత- ఇద్దరు మృతి - america latest news
అమెరికా సెయింట్ లూసియాలో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అమెరికాలో కాల్పుల మోత
శనివారం అర్ధరాత్రి జెఫ్ వాండర్లూలో కారులో ఓ వ్యక్తి పలుమార్లు కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గంట వ్యవధిలోనే ఈ ఘటనలు జరిగాయి.
ఆదివారం కూడా కాల్పుల ఘటనలు జరిగాయి. ఒక ఘటనలో వ్యక్తి తలకు గాయాలయ్యాయి. మరో ఘటనలో నలుగురు గాయపడ్డారు.