తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి

అమెరికాలోని టెక్సాస్​ ఏఅండ్ఎం విశ్వవిద్యాలయంలో ఓ ఆగంతుకుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. తుపాకీ లైసెన్స్​ కలిగిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో సుమారు 16 వందల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.

shooting incident at Texas A&M University
అమెరికాలో కాల్పుల కలకలం

By

Published : Feb 4, 2020, 5:03 AM IST

Updated : Feb 29, 2020, 2:22 AM IST

అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికాలో మారోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్​ ఏఅండ్​ఎం విశ్వవిద్యాలయంలోని కామర్స్​ క్యాంపస్​లో ఓ ఆగంతుకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రైడ్​ రాక్​ రెసిడెన్స్​ హాల్​ వద్ద ఈ ఘటన జరిగినట్లు యూనివర్సిటీ పోలీసులు తెలిపారు. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. హింసాత్మక ఘటనపై దర్యాప్తు చేపట్టి.. విశ్వవిద్యాలయంలో ముందస్తు జాగ్రత్తగా షెల్టర్​ ఏర్పాటు చేయాలని క్యాంపస్​ అధికారులను కోరినట్లు పేర్కొన్నారు.

తరగతుల రద్దు..

కాల్పుల అనంతరం.. ప్రైడ్​ రాక్​, దాని పరిసర ప్రాంతాలను మూసివేసినట్లు తెలుపుతూ.. నోటీసులు జారీ చేసింది కళాశాల యాజమాన్యం. తరగతులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

2016, ఆగస్టులో లైసెన్స్​ కలిగి.. ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే చేతి తుపాకీ కలిగిన వారు క్యాంపస్​లో తిరిగేందుకు అనుమతులు ఉన్నాయని, క్యాంపస్​లో తుపాకీని దాచేందుకూ వీలుందని పోలీసులు తెలిపారు. అలాంటి వారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు.

1600 మంది భారతీయ విద్యార్థులు..

2018 విద్యార్థి వీసా లెక్కల ప్రకారం అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థులు 1,83,312. టెక్సాస్​ ఏఅండ్​ఎం విశ్వవిద్యాలయంలో సుమారు 1,607 మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: పాఠశాలలో తొక్కిసలాట.. 13 మంది చిన్నారులు మృతి

Last Updated : Feb 29, 2020, 2:22 AM IST

ABOUT THE AUTHOR

...view details