New York Fire Accident: అమెరికాలోని న్యూయార్క్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ 19 అంతస్థుల అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 9 మంది చిన్నారులు ఉన్నారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని న్యూయార్క్ మేయర్ సలహాదారు స్టిఫన్ రింగెల్ తెలిపారు. పొగ పీల్చడం వల్ల క్షతగాత్రులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం- 19 మంది మృతి - New York Fire accident in apartment
New York Fire Accident: అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ 19 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు.
అగ్ని ప్రమాదం
సుమారు 200 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భవనంలో చిక్కుపోయిన వారిని కాపాడారు. మరణాలు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆపార్ట్‌మెంట్‌లోని రెండు, మూడో అంతస్థులో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మంటలు వేగంగా ఇతర అంతస్తులకు వ్యాపించినట్లు చెప్పారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:విహార బోట్లపై విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు మృతి
Last Updated : Jan 10, 2022, 3:47 AM IST