అమెరికాలో కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తోంది. ఉత్తర కాలిఫోర్నియాలో చెలరేగిన మంటలు ఓ పర్వతాన్ని కమ్మేయగా.. సమీపంలోని ఓ గ్రామం దగ్ధమైంది. ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో ఆగని కార్చిచ్చు- భారీగా ప్రాణ, ఆస్తి నష్టం - US wildfires 2020 deaths
అమెరికాలో కార్చిచ్చు ఎంతకూ శాంతించడం లేదు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. ఎగసిపడుతున్న మంటల ధాటికి ఇప్పటికే లక్షల ఎకరాల అడవి దగ్ధమైంది. ఇప్పటివరకు కార్చిచ్చు కారణంగా 10 మంది మరణించారు.
![అమెరికాలో ఆగని కార్చిచ్చు- భారీగా ప్రాణ, ఆస్తి నష్టం 19 dead as California fire becomes deadliest of year in US wildfires](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8764679-thumbnail-3x2-uswildfires.jpg)
అమెరికాలో ఆగని కార్చిచ్చు.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం
అమెరికాలో ఆగని కార్చిచ్చు.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం
ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వక్తం చేశారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రాష్ట్రానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
- సియెర్రా నెవాడా ప్రాంతంలో గత రెండు రోజులుగా మంటలు అంతకంతకూ విజృంభిస్తున్నాయి. బెర్రీ క్రీక్ నగరం పూర్తిగా అగ్నిలో చిక్కుకుంది. రెండు రోజుల్లోనే అక్కడ 7 మృతదేహాలను గుర్తించగా.. మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది. తీవ్ర గాయాలపాలైన మరో నలుగురిని ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావించిన అధికారులు.. గల్లంతైన వారి కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నారు. అగ్నికి ఆహుతైన భవనాలు
- శాన్ఫ్రాన్సిస్కోలో వారం రోజులుగా విస్తరించిన దావానలానికి సుమారు 2వేలకు పైగా ఇళ్లు, భవనాలు దహనమయ్యాయి. ఒరెగాన్ సరిహద్దు నుంచి ఉత్తర మెక్సికో ప్రాంతానికి సమీపంలోని సుమారు 29 పెద్ద అడవులు మంటల్లో చిక్కుకున్నాయి. కాలిపోయిన అటవీ ప్రాంతం
- ఒరెగాన్లో 3,625 చ.కి.మీ అడవి కాలిపోగా.. అక్కడ నివసించేవారిలో సుమారు 5లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటల్లో చిక్కుకుని ఇప్పటివరకు అక్కడ నలుగురు మరణించినట్లు సమాచారం. మూడురోజులుగా అక్కడ చెలరేగుతున్న కార్చిచ్చుతో సుమారు 9లక్షల ఎకరాల విస్తీర్ణంలోని అడవి దగ్ధమైంది. దగ్ధమైన వాహనాలు
- వాషింగ్టన్లో సుమారు 2,426 చదరపు కి.మీ అడవి దగ్ధమైంది. 9వేల మందిని ఇతర ప్రదేశాలకు తరలించారు. ఇప్పటివరకు ఒకరు మృతిచెందినట్లు తెలుస్తోంది. భారీ ఆస్తి నష్టం
ఇదీ చదవండి:హింసాత్మకంగా మారిన నిరసనలు.. ఏడుగురు మృతి