తెలంగాణ

telangana

ETV Bharat / international

హెచ్-​1బీ వీసాల నిలిపివేతపై భారతీయుల సవాల్

అమెరికా ప్రభుత్వం.. హెచ్​1బీ సహా ఇతర తాత్కాలిక ఉపాధి వీసాలను ఈ ఏడాది చివరి వరకు నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని, సవాల్​ చేస్తూ 174 మంది భారతీయులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పెండింగ్​లో ఉన్న హెచ్-​1బీ, హెచ్- 4 వీసాలను మంజూరు చేసేలా సంబంధిత శాఖలను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

174 Indian nationals file lawsuit against presidential proclamation on H1B
హెచ్​1బీ వీసాల నిలిపివేతను సవాల్ చేసిన ఇండియన్స్

By

Published : Jul 16, 2020, 10:46 AM IST

హెచ్-​1బీ వీసాలను ఈ ఏడాది చివరి వరకు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ 174 మంది భారతీయులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరిలో ఏడుగురు మైనర్లు కూడా ఉండడం గమనార్హం.

"హెచ్​-1బీ/ హెచ్-​4 వీసాలపై నిషేధం అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. కుటుంబాలను వేరుచేస్తుంది. నిజానికి ఇది చట్టవిరుద్ధం."

- వాస్డెన్ బనియాస్, భారతీయుల తరఫు న్యాయవాది

సమన్లు జారీ

కొలంబియా జిల్లాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో మంగళవారం ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనితో న్యాయమూర్తి కేతన్జీ బ్రౌన్ జాక్సన్​... బుధవారం అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో, హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ చాడ్ ఎఫ్ వూల్ఫ్​, కార్మిక మంత్రి యూజీన్ స్కాలియాకు సమన్లు జారీ చేశారు.

చట్టవిరుద్ధం

హెచ్​-1బీ వీసాలు సహా ఇతర తాత్కాలిక ఉపాధి వీసాలను ఈ ఏడాది చివరి వరకు నిలిపివేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా సంక్షోభం కారణంగా నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని... ఈ నేపథ్యంలో అమెరికన్లకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

అయితే ఇది చట్టవిరుద్ధమని భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్​లో ఉన్న హెచ్-​1బీ, హెచ్-4 వీసాలను మంజూరు చేసేలా సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరుతున్నారు.

ఇదీ చూడండి:ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్.. అసలేమైంది?

ABOUT THE AUTHOR

...view details