పెరూలో మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో 14 మంది మృతిచెందారు. మరో 97 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అరెక్విపా ఆసుపత్రికి తరలించారు.
దక్షిణ ప్రాంతంలోని అరెక్విపాలో పాన్ అమెరికన్ రహదారిపై రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలోనే 14 మంది మృతి చెందగా, 68 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మిగతా ప్రమాదాల్లో ప్రయాణికులకు గాయాలైనట్లు వివరించారు.