తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇంట్లో మృతదేహం.. చుట్టూ 125 పాములు.. ఏమై ఉంటుంది?

SNAKES surrounded dead man: అమెరికాలోని ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఘటన వెలుగుచూసింది. మేరీలాండ్​లో నివసించే ఓ వ్యక్తి మరణించగా.. అతడి చుట్టూ 125 పాములు కనిపించాయి. వీటిని చూసి పోలీసులు ఉలిక్కిపడ్డారు.

SNAKES surrounded dead man
SNAKES surrounded dead man

By

Published : Jan 23, 2022, 7:39 AM IST

Updated : Jan 23, 2022, 11:51 AM IST

SNAKES surrounded dead man: పొరుగింటి వ్యక్తి నిన్నటి నుంచి కనిపించడం లేదంటూ పోలీసులకు సమాచారం వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడి ఇంటికి చేరి తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అయితే అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి ఉలిక్కిపడ్డారు. సదరు వ్యక్తి కిందపడి ఉండగా.. ఆ మృతదేహం చుట్టూ దాదాపు 125 పాములు కనిపించాయి. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఈ ఘటన అమెరికాలోని మేరీలాండ్‌లో జరిగింది.

125 Snakes in dead man house

చార్లెస్‌ కౌంటీ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. దీంతో అనుమానం వచ్చిన పొరుగింటి వ్యక్తి గత బుధవారం రాత్రి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అతడి ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. అయితే సదరు వ్యక్తి మృతదేహం కిందపడి ఉండగా.. ఆ మృతదేహం చుట్టే 125 పాములు కనిపించాయి. వీటన్నింటినీ బంధించి ఉంచినట్లు తెలుస్తోంది. అందులో అత్యంత విషపూరితమైన కోబ్రాలతోపాటు, 14 అడుగుల ఓ కొండచిలువ కూడా ఉంది. ఆ సర్పాలను అతడు పెంచుకుంటున్నట్లు సమాచారం. ఇతర సహాయక సిబ్బందితో కలిసి పోలీసులు ఆ పాములన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అతడి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

అయితే ఆ ఇంట్లోని కొన్ని పాములు తప్పించుకుపోయాయేమోనని ఇరుగుపొరుగు వారు భయాందోళన వ్యక్తం చేశారు. కాగా దీనిపై చార్లెస్ కౌంటీ యానిమల్ కంట్రోల్ ప్రతినిధి జెన్నిఫర్‌ హారిస్‌ స్పందించారు. ఇంట్లోని సర్పాల్లో ఏవి కూడా తప్పించుకుపోయే అవకాశం లేదని, అన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని స్పష్టం చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:అధికారం కోసం ట్రంప్‌ అంతకు తెగించారా?.. వెలుగులోకి ఆసక్తికర ఆధారం!

Last Updated : Jan 23, 2022, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details