అమెరికాలోని ఇటీవల తుపాకీ మోతలు పెరిగిపోయాయి. తాజాగా చికాగో నగరంలోని శ్మశాన వాటికకు సమీపంలో ఉన్న 79వ వీధి, కార్పెంటర్ వీధుల్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
కాల్పుల కలకలం.. 12 మందికి తీవ్ర గాయాలు - Gun fire
అమెరికా చికాగోలోని రెండు వీధుల్లో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. మరింత మంది గాయపడి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
అమెరికాలో కాల్పుల కలకలం
మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఘటనా సమయంలో చాలా మంది భయంతో పరుగులు తీసిన క్రమంలో ఎంత మంది గాయపడ్డారో స్పష్టంగా తెలియదని చెప్పారు. ఆసుపత్రిలో చేరిన వారు కాకుండా మరింత మంది గాయపడి ఉంటారని భావిస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనా నుంచి రక్షణకు అమెరికాలో మరో టీకా