కరోనా వ్యాక్సిన్ ముడిపదార్థాల సరఫరా విషయంలో భారత్ ప్రతిపాదనను అంగీకరించొద్దని 12 మంది అమెరికా చట్ట సభ్యులు అధ్యక్షుడు బైడెన్ బృందాన్ని కోరారు. కరోనా నేపథ్యంలో వర్తక సంబంధిత మేథో సంపత్తి హక్కుల (ట్రిప్స్) నిబంధనలను తాత్కాలికంగా సడలించొద్దని సూచించారు.
కరోనా వైరస్ ఉద్ధృతిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలకు ఇప్పుడు వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధంగా కనిపిస్తోంది. దీంతో ప్రపంచంలో వ్యాక్సిన్ ముడిపదార్థాల ఎగుమతిదారుల్లో ఒకటైన అమెరికా.. ప్రపంచ దేశాలకు సరఫరాను నిలిపివేసింది. వర్తక సంబంధిత మేథో సంపత్తి హక్కుల (ట్రిప్స్) ఒప్పందం నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో అభివృద్ధి చెందుతున్న 60 దేశాల తరఫున.. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వేదికగా.. ట్రిప్స్ నిబంధనలు సడలించాలని భారత్, దక్షిణాఫ్రికా విజ్ఞప్తి చేశాయి.
అయితే ఆ వినతికి మద్దతుగా నిలవాలని కొందరు అమెరికా చట్టసభ్యులు కోరినప్పటికీ.. కొందరు మాత్రం తిరస్కరిస్తూ.. అగ్రరాజ్య వ్యాపార ప్రతినిధి కేథరిన్ టాయ్కు లేఖ రాశారు.
భారత్, దక్షిణాఫ్రికా దేశాల అభ్యర్థనను అమెరికా అంగీకరిస్తే.. స్వదేశంలోని ఉత్పత్తిపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు.
సాయం చేయాల్సిందే..