తెలంగాణ

telangana

ETV Bharat / international

కూలిన 12 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 100 మంది! - అమెరికాలో విషాద ఘటనలు

బహుళ అంతస్తుల భవనం పాక్షికంగా కూలిపోయిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. వందలమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. అమెరికా మియామీలో జరిగిన ఈ ప్రమాదంలో.. ప్రాణనష్టం అధికంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

building collapsed
అమెరికాలో ఓ వైపు కూలిపోయిన 12 అంతస్తుల భవనం

By

Published : Jun 25, 2021, 10:47 AM IST

కూలిపోయిన 12 అంతస్తుల భవనం..

అమెరికా ఫ్లోరిడా రాష్ట్రం మియామీలో 12 అంతస్తుల భవనంలో కొంతభాగం కుప్పకూలిన ఘటనలో ఒకరు చనిపోగా.. అనేక మంది అపార్ట్‌మెంట్ వాసులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న అనేక మందిని అగ్నిమాపక సిబ్బంది వెలికి తీశారు. దాదాపు వంద మంది ఆచూకీ తెలియడంలేదని భావిస్తున్నారు.

అయితే.. భవనం కుప్పకూలిన సమయంలో ఎంతమంది లోపల ఉన్నారనే అంశంపై స్పష్టతలేదని విపత్తు నిర్వహణ సిబ్బంది వెల్లడించారు. చూస్తుండగానే అపార్ట్​మెంట్​ కూలిపోయిందని.. డజన్లకొద్దీ ప్రాణాలు విడిచారని భయపడినట్లు స్థానికులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details