అమెరికాలో కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ప్రాణాలతో బయటపడ్డారు 103 ఏళ్ల బామ్మ. ఆమె సాధించిన విజయానికిగానూ చల్లటి బడ్లైట్ బీరుతో వేడుక చేశారు ఆస్పత్రి సిబ్బంది.
కరోనాను జయించిన 103ఏళ్ల బామ్మ.. చిల్డ్ బీర్‌తో సంబరాలు - us latest news
అమెరికాలోని మసాచుసెట్స్‌లో 103ఏళ్ల బామ్మ కరోనాపై పోరాడి విజయం సాధించారు. ఇందుకు ఆమెకు ఐస్ కోల్డ్ బడ్లైట్ బీర్ ఇచ్చి ఆస్పత్రి సిబ్బంది వేడుక నిర్వహించారు.

కరోనా నుంచి కోలుకున్న 103ఏళ్ల బామ్మ
అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన 103 ఏళ్ల స్టెజ్నా.. కొద్ది రోజుల క్రితం జ్వరంతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ ఆస్పత్రిలో అదే తొలి కరోనా కేసు. ఆమెకు ప్రత్యేకంగా చికిత్స అందించారు వైద్య సిబ్బంది. మే 13న ఆమె కోలుకున్నారు. ఇటీవలే డిశ్చార్జి అయ్యారు.
స్టెజ్నా దృఢ విశ్వాసమే వైరస్ నుంచి కోలుకునేందుకు కారణమని ఆమె మనుమరాలు చెబుతోంది. 103 ఏళ్ల స్టెజ్నాకు ఇద్దరు సంతానం. మొత్తం 10 మంది మనుమరాళ్లు ఉన్నారు. 1992లోనే ఆమె భర్త చనిపోయారు.