తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫ్లాయిడ్​ నిరసనల్లో కాల్పులు- ఒకరు మృతి

జార్జి ఫ్లాయిడ్​ మృతికి వ్యతిరేకంగా అమెరికాలో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మినియాపొలిస్​లో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించారు. 11 మంది గాయపడ్డారు.

10 shot with injuries of 'various severity' in Minneapolis
మినియా పోలీస్​లో 10మంది పై కాల్పులు

By

Published : Jun 21, 2020, 2:53 PM IST

Updated : Jun 21, 2020, 3:08 PM IST

అమెరికాలోని మినియాపొలిస్​లో జార్జ్​ ఫ్లాయిడ్​ ఆందోళనల్లో హింస చెలరేగింది. గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు.

ఆదివారం ఉదయం 3 గంటల సమయంలో పోలీసులు ఈ విషయాన్ని ట్విట్టర్​లో వెల్లడించారు. ఘటన జరిగిన మినియాపొలిస్​లోని అప్​టౌన్​ థియేటర్ ప్రాంతం వైపు ప్రజలెవ్వరూ రావద్దని పోలీసులు సూచించారు.

సూపర్ మార్కెట్​, థియేటర్ వద్ద కాల్పులు జరిగినట్లు కనిపిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి. ఫేస్​బుక్​లో పోస్ట్​ చేసిన ఓ వీడియోలో క్షతగాత్రుల ఆర్తనాదాలు, రక్తపు మరకలు స్పష్టంగా కన్పించాయి. ఘటనకు సంబంధించి పోలీసులను మరింత సమాచారం అడిగితే ఎలాంటి స్పందన లేదని స్థానికులు తెలిపారు.

ఇదీ చూడండి: హెచ్​1బీ వీసాల రద్దుపై 2 రోజుల్లో నిర్ణయం!

Last Updated : Jun 21, 2020, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details