పెన్సిల్వేనియాలో ఆలస్యంగా వచ్చిన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టును 10 మంది రిపబ్లికన్ అటార్నీ జనరళ్లు ఆశ్రయించారు. మూడు రోజుల తర్వాత వచ్చిన వాటిని స్వీకరించాలని దిగువ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. రిపబ్లికన్ పార్టీ ఇప్పటికే దాఖలు చేసిన వ్యాజ్యంతో కలిపి తమ పిటిషన్లను విచారించాలని కోరారు.
'ఎన్నికల అక్రమాల'పై రిపబ్లికన్ల పోరు ముమ్మరం - supreme court elections
పోస్టల్ ఓట్ల లెక్కింపుపై పెన్సిల్వేనియా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు రిపబ్లికన్ పార్టీ పాలనలో ఉన్న 10 రాష్ట్రాల అటార్నీ జనరళ్లు. ఆలస్యంగా వచ్చిన ఓట్లను లెక్కించమని తీర్పునివ్వటం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. దిగువ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థించారు.
రిపబ్లికన్లు
పెన్సిల్వేనియా ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని వీరు ఆరోపించారు. ఆలస్యంగా వచ్చిన ఓట్లను స్వీకరించాలని ఆదేశించి రాజ్యాంగంలోని ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని సుప్రీంకు తెలిపారు. ఈ విధమైన మెయిల్ ఇన్ బ్యాలెట్ ద్వారా ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు.
ఇదీ చూడండి:కోర్టుకెక్కిన ట్రంప్- కౌంటింగ్ నిలిపివేయాలని డిమాండ్!