తెలంగాణ

telangana

ETV Bharat / international

10 శాతం తగ్గిన హెచ్​-1బీ వీసాల జారీ - వలస విధానం

హెచ్​-1బీ వీసాలు 2017తో పోలిస్తే 2018లో 10 శాతం మేర తక్కువగా జారీ చేసినట్టు అమెరికా తెలిపింది.

వీసా

By

Published : Jun 5, 2019, 1:38 PM IST

2018 సంవత్సరానికి గాను హెచ్​-1బీ వీసాల జారీలో క్షీణత నమోదైంది. 2017తో పోలిస్తే 10 శాతం తక్కువ మందికి అమెరికా అనుమతులిచ్చింది. అగ్రరాజ్యానికి వెళ్లాలనుకునే భారత ఐటీ నిపుణులకు ప్రధాన మార్గం హెచ్​-1బీ వీసాలే.

2018 ఆర్థిక సంవత్సరంలో కొత్తవి, పునరుద్ధరణ దరఖాస్తులు కలిపి మొత్తం 3,35,000 మందికి హెచ్​-1బీ అనుమతులిచ్చింది అమెరికా పౌర, ఇమ్మిగ్రేషన్​ సేవల విభాగం. 2017లో 3,73,400 మందికి వీసాలను జారీ చేసినట్టు వార్షిక నివేదికలో పేర్కొంది. దాఖలైన దరఖాస్తులకు అనుమతుల పరంగా చూస్తే 2017లో 93 శాతం, 2018లో 85 శాతంగా నమోదైంది.

"హెచ్​-1బీ కార్యక్రమాన్ని నియంత్రించేందుకు అమెరికా అనేక వ్యూహాలను అమలు చేస్తోంది. ప్రస్తుత నివేదికలు చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది."

-సారా పియర్స్​, వలస విధాన సంస్థ విశ్లేకురాలు

హెచ్​-1బీ వలస రహిత వీసా అందిస్తోంది అమెరికా. వివిధ రంగాల్లో నిపుణులను విదేశాల నుంచి రప్పించేందుకు అమెరికా సంస్థలు ఈ వీసాను ఉపయోగిస్తాయి. భారత ఐటీ నిపుణులు కూడా ఎక్కువగా ఇదే వీసాపై ఆధారపడతారు.

ఇదీ చూడండి: సినీ ఫక్కీలో మహిళా ముఠా వరుస చోరీలు

ABOUT THE AUTHOR

...view details