ప్రపంచం అరచేతిలోకి వచ్చాక సంపాదనకు(Baby influencer) బోలెడన్ని దారులు తెరుచుకున్నాయి. ఇంట్లో కూర్చొనే రూ.లక్షలు సంపాదిస్తున్నారు. కొత్త కొత్త ప్రొఫెషన్స్.. ఊహించనంత ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఉద్యోగాలుగా అనిపించని అలాంటి ఓ వింత కొలువుతో.. నెలకు రూ. 75 వేలు సంపాదిస్తున్నాడు. అదీ ఏడాది వయసున్న చిన్నారి కావడం మరింత ప్రత్యేకం.
చేసే పనేంటంటే?
దేశాలు పర్యటించడం (Baby travel). ఇదేంటి అనుకుంటున్నారా. అవును.. అమెరికాకు చెందిన బేబీ బ్రిగ్స్(Baby influencer) ఇప్పటికే 45 సార్లు విమాన ప్రయాణం చేశాడు. అమెరికాలోని 16 రాష్ట్రాలను చుట్టొచ్చాడు. అలస్కా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, ఉటావాల్లోని పార్కులు, బీచ్ల్లోనూ తిరిగాడు.
అసలు దీనికి డబ్బులెలా ఇస్తారని ఆలోచిస్తున్నారా? అసలు సంగతి ఇక్కడే ఉంది. చిన్న పిల్లలతో విమానయానం సహా ఇతర ప్రయాణాలు చేయడం ఎలా అనేదే ఇందులో చూపిస్తారు.
ఇన్స్టాగ్రామ్లో(Instagram Influencer)బ్రిగ్స్కు 30 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇతని పేరిట పార్ట్ టైమ్ టూరిస్ట్స్ అనే ఒక బ్లాగ్ కూడా నడిపిస్తోందా చిన్నారి తల్లి జెస్. చిన్నారితో దేశాలు చుట్టి.. సంబంధిత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆమె పని. దీనికి డబ్బులు కూడా చెల్లిస్తారు. ఇలా సగటున నెలకు రూ. 75 వేలకుపైనే ఆదాయం వస్తోంది.
''2020లో నేను గర్భిణీగా ఉన్నప్పుడు నా జీవితం అయిపోయిందని ఘోరంగా బాధపడ్డా. నేను బిడ్డకు జన్మనివ్వగలనా, నాకు ఇది సాధ్యమేనా అనే అనుమానం కలిగింది.''