అమెరికా మిస్సిసిప్పీ రాజధానిలోని ఓ నైట్ క్లబ్లో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
హిండ్స్ కౌంటీలోని జాక్సన్లో ఎం-బార్ స్పోర్ట్స్ గ్రిల్ వద్ద ఈ దుర్ఘటన జరిగిందని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో 41ఏళ్ల కార్టెజ్ షెల్బీ అనే వ్యక్తి అక్కడిక్కడే చనిపోగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. గాయపడినవారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.