అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. షికాగో బ్లూమింగ్డేల్ గ్రామంలోని ఇండియన్ లేక్స్ హోటల్లో జరిగిన ఈ ఉదంతంలో ఒక వ్యక్తి చనిపోయాడు. అనేక మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు వివరించారు.
స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి 2.35 గంటలకు ఈ ఘటన జరిగింది. తాము అక్కడికి చేరుకునే సమయానికి హోటల్ నుంచి ప్రజలు పరుగులు తీస్తూ కనిపించారని పోలీసులు వివరించారు.