అమెరికా షికాగోలోని ట్రాఫిక్ స్టాప్‌లో జరిగిన కాల్పుల్లో 29ఏళ్ల మహిళ పోలీసు అధికారి మరణించారు. మరొక అధికారి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చికాగోవాసులు కలసికట్టుగా కాల్పులను ఎదుర్కోవాలని నగర మేయర్ పిలుపునిచ్చారు.
షికాగోలో కాల్పుల కలకలం-పోలీసు ఆఫీసర్ మృతి
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. షికాగోలోని ట్రాఫిక్ స్టాప్‌లో జరిగిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి మృతి చెందారు. మరో అధికారికి గాయాలయ్యాయి.
షికాగోలో కాల్పుల కలకలం
చనిపోయిన పోలీసు అధికారిణిని ఎల్లా ఫ్రెంచ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు షికాగో పోలీస్ విభాగం ఆదివారం తన ఫేస్బుక్ ఖాతాలో వివరాలను పేర్కొంది. విధి నిర్వహణలో ఓ మహిళా పోలీసు అధికారి చనిపోవడం 33 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి అని తెలిపారు. 2018 తరువాత షికాగోలో ఇలా అధికారి చనిపోవడం కూడా మొదటిసారని వెల్లడించారు.
ఇదీ చూడండి:'వైమానిక దాడుల్లో 572 మంది తాలిబన్ల హతం'