తెలంగాణ

telangana

ETV Bharat / international

జాత్యహంకార వీడియోలపై యూట్యూబ్ నిషేధం - సామాజిక మాధ్యమాలు

ప్రముఖ వీడియో షేరింగ్ సంస్థ యూట్యూబ్ కీలక నిబంధనలు తీసుకువచ్చింది. జాత్యహంకారాన్ని, విద్వేషాన్ని, హింసను ప్రేరేపించే వీడియోలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

యూట్యూబ్​

By

Published : Jun 6, 2019, 7:35 AM IST

జాత్యహంకారాన్ని, హింసను, విద్వేషాన్ని రెచ్చగొట్టే వీడియోలను తమ ప్లాట్​ఫాంపై నిషేధిస్తున్నట్లు వీడియో షేరింగ్ దిగ్గజం యూట్యూబ్ ప్రకటించింది.

కొన్ని టెక్ సంస్థలు ఈ తరహా వీడియోలపై చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో... యూట్యూబ్ కూడా ప్రక్షాళనకు సిద్ధమై కీలక నిర్ణయం తీసుకుంది.

"ద్వేషపూరిత ప్రసంగాలపై నిషేధం సహా.. సమాజానికి చేటు చేసే విషయాలపై ఎల్లప్పుడూ కఠిన నియమాలతో ఉంటాం. ఇప్పుడు మేము మరో కీలక నిర్ణయం తీసుకున్నాం. " - యూట్యూబ్​

న్యూజిలాండ్​లోని ఓ మసీదులో మారణహోమం సృష్టించి దాన్ని సామాజిక మాధ్యమంలో ప్రత్యక్షపసారం చేశాడు ఓ జాత్యంహంకారి.

దీనిపై గత నెలలో పారిస్​​లో చర్చించిన కొందరు దేశాధినేతలు.. సామాజిక మాధ్యమాల సంస్థలు ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ నిబంధనలు తీసుకువచ్చినట్లు యూట్యూబ్ పేర్కొంది.

"మేము ఇప్పుడే కొత్త నిబంధనలు తీసుకొచ్చాం. పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు కాస్త సమయంపట్టొచ్చు. రానున్న కొన్ని నెలల్లో పూర్తి స్థాయి నిఘా ఏర్పాటు చేస్తాం." - యూట్యూబ్​

వీటితో పాటు భూమి బల్లపరుపుగా ఉందనే లాంటి అసత్యాలతో కూడిన తప్పుడు వివరణలు చెప్పే ఛానెళ్లపైనా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది యూట్యూబ్​.

ఇదీ చూడండి:'ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ'

ABOUT THE AUTHOR

...view details