భారీ వర్షాల కారణంగా యెమెన్ దేశంలో వరదలు సంభవించాయి. వరదల ప్రభావానికి ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. మృతులు యెమెన్ రాజధాని సనా, ఐబీబీ, షబ్వా, హోడీడా రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు.
ఆడెన్, తాయిజ్, హద్రామావత్ రాష్ట్రాల్లోనూ భారీగా వరదలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇళ్లు నీటమునిగాయన్నారు. ఇళ్లలో, కార్లలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు.