తెలంగాణ

telangana

ETV Bharat / international

వెనెజువెలాలో తారస్థాయికి నిరసన సెగలు - Venezuela

వెనెజువెలాలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తారస్థాయికి చేరాయి. ప్రతిపక్ష నేత గుయాడో నేతృత్వంలో చేపట్టిన నిరసనలకు వందలాది మంది మద్దతు పలికారు. అధ్యక్షుడు మదురోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదుపు చేయాలని చూసిన పోలీసులపైనే రాళ్ల దాడి చేశారు.

వెనెజువెలాలో తారస్థాయికి నిరసన సెగలు

By

Published : May 1, 2019, 6:43 AM IST

Updated : May 1, 2019, 9:06 AM IST

వెనెజువెలాలో తారస్థాయికి నిరసన సెగలు

వెనెజువెలాలో ప్రభుత్వ వ్యతిరేకులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షనేత 'జాన్​ గుయాడో', ప్రధాన ఉద్యమకారుడు 'లిపోల్డో లోపెజ్'​లు మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వందలాది మంది ఈ నిరసనల్లో పాల్గొని మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనల్లో మొత్తం 68 మందికి గాయాలయ్యాయి.

భద్రతా సిబ్బంది వాహనాలను తగలబెడుతూ... పోలీసులపై రాళ్లు విసురుతూ నిరసనకారులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు నిరసనకారులపై రబ్బరు​ బుల్లెట్లతో పాటు బాష్పవాయువు​ను ప్రయోగించారు పోలీసులు.

Last Updated : May 1, 2019, 9:06 AM IST

ABOUT THE AUTHOR

...view details