మధ్య ఆఫ్రికా దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఒక చిన్నపాటి విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 23 మంది మరణించారు. గోమా ఎయిర్‌పోర్ట్ నుంచి బిజీ బీ విమానయాన సంస్థకు చెందిన డోర్నియర్ -228 విమానం బెనీకి బయల్దేరింది. గాల్లోకి లేచిన కాసేపటికే నివాస ప్రాంతంలో కుప్పకూలిపోయింది.
కుప్పకూలిన విమానం.. 23 మంది మృతి! - తెలుగు అంతర్జాతీయం నేర వార్తలు
మధ్య ఆఫ్రికా దేశంలోని కాంగోలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 23 మంది మరణించారు. సాంకేతిక లోపంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
![కుప్పకూలిన విమానం.. 23 మంది మృతి!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5163863-746-5163863-1574601138683.jpg)
కుప్పకూలిన విమానం.. 23 మంది మృతి!
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : కారు ఎక్కి గుండ్రంగా చక్కర్లు కొట్టిన శునకం!