రెండు రైళ్లు ఢీ- 32 మంది దుర్మరణం - ఈజిప్టు ప్రమాదం

17:45 March 26
రెండు రైళ్లు ఢీ- 32 మంది దుర్మరణం
దక్షిణ ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 32 మంది మరణించారు. 66 మంది గాయపడ్డారు. సొహాగ్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దక్షిణ కైరోకు 460 కి.మీల దూరంలోని షోహాగ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొని నాలుగు బోగీలు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.
ఘటనా స్థలానికి 36 అంబులెన్స్‌లు చేరుకున్నట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి డాక్టర్ ఖలీద్ మెజాహెద్ వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.