తెలంగాణ

telangana

By

Published : Feb 4, 2020, 12:46 AM IST

Updated : Feb 29, 2020, 2:21 AM IST

ETV Bharat / international

పాఠశాలలో తొక్కిసలాట.. 13 మంది చిన్నారులు మృతి

కెన్యాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్​ వదిలిన క్రమంలో తొక్కిసలాట జరిగి 13 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Kenya school stampede
పాఠశాలలో తొక్కిసలాట

కెన్యాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నైరోబి సమీప కాకమెగా నగరంలోని కాకమెగా ప్రాథమిక పాఠశాలలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 13 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు అధికారులు.

పాఠశాలలో ప్రమాదం పొంచి ఉందని విద్యార్థుల్లో భయాందోళనలు చెలరేగి తొక్కిసలాటకు కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు అధికారులు. సాయంత్రం 5 గంటలప్రాంతంలో పాఠశాల వదిలిన క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

"ఈ తొక్కిసలాటలో 13 మంది పిల్లలను కోల్పోయాం. మిగతా వారు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు."

- డేవిడ్​ కబెన, కాకమెగా నగర పోలీసు కమిషనర్​

అయితే ఈ ప్రమాదం వెనకగల కారణాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు డేవిడ్​. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

అత్యవసర విభాగాలు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు కెన్యా రెడ్​ క్రాస్​ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

కెన్యా రెడ్​ క్రాస్​ ట్వీట్​

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్​: గూగుల్​తో జతకట్టిన డబ్ల్యూహెచ్​ఓ

Last Updated : Feb 29, 2020, 2:21 AM IST

ABOUT THE AUTHOR

...view details