ఆరోగ్య సంరక్షణ సేవల్లో డ్రోన్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ విషయంలో ఆఫ్రికాలోని రువాండా.. మిగతా వర్ధమాన దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ దేశంలో డ్రోన్ల ద్వారా ఇప్పటికే రక్తం యూనిట్లు, మందులు, మెడికల్ శాంపిళ్లతో పాటు అవయవాలను సైతం విజయవంతంగా తరలిస్తున్నారు.
ఆకాశంలో ఎగిరొచ్చిన కరోనా టెస్టింగ్ కిట్లు! - karona news in telugu
ప్రాణం పోసే వైద్యులకు అందుకు కావల్సిన ఆయుధాలు అందుబాటులో లేకుంటే చాలా కష్టం. అందుకే, వైద్యపరికరాలను వేగంగా సరఫరా చేసేందుకు ఆధునిక డ్లోన్లను వినియోగిస్తున్నాయి కొన్ని దేశాలు. తాజాగా ఈ కరోనా విపత్తు సమయంలో రువాండాలో మెడికల్ డ్రోన్లతో పరీక్ష కిట్లను డాక్టర్లకు చేరవేసింది.
ఆకాశంలో ఎగిరొచ్చిన కరోనా టెస్టింగ్ కిట్లు!
ఎలాంటి ప్రాంతానికైనా సత్వరమే వైద్య సామగ్రిని పంపే ఈ డ్రోన్లను ప్రస్తుతం కొవిడ్-19 టెస్టింగ్ కిట్ల సరఫరాలోనూ వినియోగిస్తున్నారు. మరో ఆఫ్రికా దేశం ఘనాలోనూ ఈ ఒరవడి ప్రారంభమైంది. ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టు పేరిట ఈ తరహా మెడికల్ డ్రోన్లను భారత్‌లోనూ ప్రారంభించేందుకు ప్రపంచ ఆర్థిక ఫోరం చొరవ చూపుతోంది.
ఇదీ చూడండి:ఆ కుక్కలకు యజమానుల నుంచే కరోనా సోకింది
Last Updated : May 17, 2020, 9:42 AM IST