తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉచిత పెట్రోల్​​ కోసం వెళ్లి 62 మంది బలి - ఇంధనం

ఆఫ్రికా దేశం టాంజానియాలో ఘోర ప్రమాదం జరిగింది. దార్​ ఎస్​ సలాంలో ఆయిల్ ట్యాంకర్ పేలి 62 మంది మృతి చెందారు. సుమారు 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. చమురు ఉచితంగా ఎత్తుకెళ్లేందుకు వచ్చినవారిలో ఒకరు సిగరెట్ కాల్చడమే ప్రమాదానికి కారణం.

ఉచిత పెట్రోల్​​ కోసం వెళ్లి 62 మంది బలి

By

Published : Aug 10, 2019, 6:09 PM IST

Updated : Aug 10, 2019, 6:32 PM IST

టాంజానియా ఆర్థిక రాజధాని దార్​ ఎస్​ సలాంలో ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై బోల్తాపడిన ఇంధన ట్యాంకర్​ పేలి 62 మంది మరణించారు. సుమారు 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది.

ఉచిత పెట్రోల్​​ కోసం వెళ్లి 62 మంది బలి

"మొరాగోరో పట్టణానికి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. బోల్తాపడిన ట్యాంకర్​ నుంచి స్థానికులు ఇంధనం సేకరించడానికి గుమిగూడారు. ఆ సమయంలో ఎవరో సిగరెట్ వెలిగించడం వల్ల ట్యాంకర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 62 మంది మరణించారు."-పోలీసులు

'ఇంధనాన్ని సేకరించడానికి వచ్చిన 'బోడా-బోడా' టాక్సీ డ్రైవర్లు, స్థానికులే ఈ ప్రమాదం బారిన పడ్డారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి' అని పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని ద్విచక్రవాహనాలు, చెట్లు కాలి బూడిదయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

గత నెలలో జరిగిన ప్రమాదంలో.... పెట్రోల్ ట్యాంకర్​ పేలి, 45 మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు.

ఇదీ చూడండి: దిల్లీ-లాహోర్ బస్సుకు బ్రేక్​ వేసిన పాక్​



Last Updated : Aug 10, 2019, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details