ఆఫ్రికా దేశం ఇథియోపియాలోని అంహారా రాష్ట్రాన్ని నియంత్రణలోకి తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ సైనిక జనరల్‌ను ఆ దేశ పోలీసులు కాల్చి చంపారు. సైనికాధిపతి జనరల్ సీర్ మెకోన్నెన్ హత్యకు సంబంధముందన్న అనుమానాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంహారా రాష్ట్ర భద్రతా విభాగం అధ్యక్షుడు అసమ్‌న్యీ త్సిగే రాష్ట్రంపై తిరుగుబాటు చేసి తన స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి పథకం వేశాడు. ఈ క్రమంలో అంహారా ప్రాంతీయాధ్యక్షుడు అబచెవ్ మెకోన్నెన్ అంగరక్షకులను లోబర్చుకుని అబచెవ్‌తో పాటు ఆయన సలహాదారుడిని కాల్చి చంపించాడు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఇథియోపియా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సీరే మెకోన్నెన్, మరో పదవీ విరమణ చెందిన జనరల్‌ను కూడా ఇదే తరహాలో అంగరక్షకులతోనే కాల్చి చంపించాడు.