Suicide Bomb Attack in Somalia: సోమాలియాలోని హిరాన్ రీజియనుకు చెందిన బాలెడ్‌వెయిన్ నగరంలో శనివారం మధ్యాహ్నం భోజన సమయంలో రద్దీగా ఉండే ఓ రెస్టారెంటు వద్ద మానవబాంబు పేలింది. ఈ పేలుడులో కనీసం 15 మంది మరణించి ఉంటారని పోలీసులు తెలిపారు. మృతులంతా అమాయక పౌరులే.
సోమాలియా రెస్టారెంటులో పేలిన మానవబాంబు - Terrorrism
Suicide Bomb Attack in Somalia: సోమాలియాలోని బాలెడ్‌వెయిన్ నగరంలో ఓ రెస్టారెంటు వద్ద మానవబాంబు పేలింది. ఈ ఉగ్ర ఘాతుకంలో 15 మంది మృతి చెంది ఉంటారని పోలీసులు వెల్లడించారు.
![సోమాలియా రెస్టారెంటులో పేలిన మానవబాంబు suicide bomber news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14516375-thumbnail-3x2-yv.jpg)
Suicide Bomb Attack in Somalia
మరో 20 మంది క్షతగాత్రులుగా మారినట్లు పోలీసుల అధికార ప్రతినిధి డిని రాబ్ల్ అహ్మద్ మీడియాకు తెలిపారు. పేలుడుతో భారీగా ఆస్తినష్టం జరిగిందన్నారు. అల్-షబాబ్ ఉగ్రవాద దళం ఇది తమ పనే అని ప్రకటించింది. సోమాలియాలో దీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికల ప్రక్రియకు ముందు ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.
ఇదీ చూడండి:ఉక్రెయిన్ సైన్యంపై బాంబుల వర్షం.. భయంతో పరుగులు!