తెలంగాణ

telangana

ETV Bharat / international

సూడాన్​ ఘర్షణల్లో 130 మంది మృతి

సూడాన్​ మరోసారి రక్తమోడింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మృతుల సంఖ్య 130కి చేరింది. 189 మంది గాయపడ్డారు.

Sudan
సూడాన్

By

Published : Jan 19, 2021, 4:47 AM IST

సుడాన్‌లోని పశ్చిమ డార్ఫుర్ ప్రాంతంలో అరబ్బులు, అరబేతరులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 130 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అలాగే ఒక నవజాతశిశువు సహా మరో 189 మంది తీవ్రంగా గాయపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

గత శుక్రవారం డార్ఫుర్‌ రాష్ట్రం జెనినా ప్రాంతంలో గల ఓ శిబిరంలో ఉద్రిక్తత చెలరేగింది. అది అతిపెద్ద హింసాకాండకు దారి తీసింది. ఘర్షణల్లో భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా మరింత మంది రోడ్డున పడ్డారు. అరబ్‌ రెజిగాట్‌ తెగకు..... అరబ్‌లు కానీ మస్సాలిట్‌ తెగలకు మధ్య జరిగిన ఘర్షణలో సుమారు 50వేల మంది నిరాశ్రయులుగా మారినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. పశ్చిమ డార్ఫుర్‌లో ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చేందుకు సైన్యం, పోలీసులు రంగంలోకి దిగారు. మరోమారు ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details