Sudan Mine Collapse: బంగారం గని పైకప్పు కూలిన ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సూడాన్ పశ్చిమ కోర్దోఫాన్ ప్రావిన్స్‌లోని ఫూజా గ్రామంలో జరిగింది. దీనిపై స్పందించిన సంబంధిత సంస్థ.. ఈ గని ప్రస్తుతం వినియోగంలో లేదని పేర్కొంది.
వినియోగంలో లేకున్నా..
మూతపడ్డ ఆ గని వద్ద అధికారులు భద్రతను సడలించడం వల్ల పలువురు స్థానికులు అందులోకి ప్రవేశించారని సంస్థ తెలిపింది. అయితే ఈ గనిని ఎప్పుడు నిలిపివేశారు? అందుకు కారణాలేంటి? మొదలైన వివరాలను సంస్థ వెల్లడించలేదు. ఇప్పటివరకు ఎనిమిది మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక మీడియా తెలిపింది.
బంగారు గనులు ఎక్కువ ఉండే సూడాన్‌లో ఈ తరహా ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. గనులలో ఎలాంటి భద్రతా ప్రమాణాలను పాటించకపోవడమే అందుకు కారణం.
ఇదీ చూడండి :Milk In Japan: బాబ్బాబు.. ఇంకో గ్లాసు పాలు తాగు ప్లీజ్..!