సూడాన్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 23 మందిలో కనీసం 18 మంది భారతీయులు ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. సుడాన్ రాజధాని ఖార్తూమ్‌లోని పారిశ్రామిక వాడలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సెరామిక్ ఫ్యాక్టరీలో ఎల్‌పీజీ ట్యాంకర్ పేలినందున 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 130 మందికి గాయాలయ్యాయి.
సూడాన్ అగ్ని ప్రమాదంలో 18 మంది భారతీయులు మృతి! - fire accident in sudan
సూడాన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెరామిక్ కర్మాగారంలో ఎల్‌పీజీ ట్యాంకర్ పేలడం వల్ల సంభవించిన ఈ ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో కనీసం 18 మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది.
సుడాన్ అగ్ని ప్రమాదంలో 18 మంది భారతీయులు మృతి
ఈ కర్మాగారంలో 50 మందికిపైగా భారతీయులు పని చేస్తున్నట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించకపోయినా...18 మంది వరకు భారతీయులు మృతి చెంది ఉంటారని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయినందున చనిపోయినవారి వివరాలు గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భారతీయులకు గాయాలు కాగా...వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 34 మంది భారతీయులు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
Last Updated : Dec 4, 2019, 8:17 PM IST
TAGGED:
fire accident in sudan