తెలంగాణ

telangana

ETV Bharat / international

మండేలా విడుదలకు పాటుపడిన 'క్లెర్క్' ఇకలేరు! - ఎఫ్‌డబ్ల్యూ డీ క్లెర్క్

శ్వేతజాతికి చెందిన దక్షిణాఫ్రికా చివరి అధ్యక్షుడు ఎఫ్‌డబ్ల్యూ డీ క్లెర్క్ (85) తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో పోరాడుతూ ఆయన మరణించినట్లు 'క్లెర్క్ ఫౌండేషన్' ప్రకటించింది. నల్లజాతి అభివృద్ధి కోసం కృషి చేసిన క్లెర్క్.. నెల్సన్ మండేలాతో కలిసి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.

Klerk
ఎఫ్‌డబ్ల్యూ డీ క్లెర్క్

By

Published : Nov 11, 2021, 7:28 PM IST

దక్షిణాఫ్రికాకు చివరి శ్వేతజాతి అధ్యక్షుడిగా పనిచేసిన ఎఫ్‌డబ్ల్యూ డి క్లెర్క్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 85 ఏళ్లు. క్యాన్సర్‌తో పోరాడుతూ కేప్​టౌన్‌ ఫ్రెస్నేలోని తన ఇంట్లో ఆయన మరణించినట్లు క్లెర్క్ ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయనకు భార్య ఎలిటా, పిల్లలు జాన్, సుసాన్​తో పాటు మనవరాళ్లు ఉన్నారు.

వర్ణవివక్ష ఉన్న సమయంలో అధ్యక్షునిగా క్లెర్క్ పనిచేశారు. వర్ణవివక్షపై పోరాటం చేస్తూ 27ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన మండేలా విడుదలకు పార్లమెంటులో ఆదేశాలు జారీచేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

నెల్సన్ మండేలాతో ఎఫ్‌డబ్ల్యూ డీ క్లెర్క్

ఆదర్శనీయం..

1990 ఫిబ్రవరి 2న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సహా.. ఇతర ఉద్యమ సంఘాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటిస్తూ క్లెర్క్ చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోతుంది. 27 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న నెల్సన్ మండేలాను విడుదల చేయాలనే ఆదేశాలనూ ఆయన అదే వేదికపై నుంచి జారీచేయడం విశేషం. ఆయన ప్రసంగం మధ్యలోనే పలువురు సొంత పార్టీ ఎంపీలే సభ నుంచి వాకౌట్ చేసినప్పటికీ ఆయన బెదిరిపోకుండా మండేలా విడుదలకు చర్యలు చేపట్టారు. నాలుగేళ్ల అనంతరం జరిగిన మొట్టమొదటి ప్రజాస్వామ్య ఎన్నికల్లో మండేలా తొలి నల్లజాతి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఎఫ్‌డబ్ల్యూ డీ క్లెర్క్

నల్లజాతీయుల కోసం..

వర్ణవివక్షను రూపుమాపేందుకు స్థాపించిన జాతీయ పార్టీ సభ్యునిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు క్లెర్క్. ఆఫ్రికాలో పలు ఉన్నత పదవులను అధిరోహించారు. 1994లో జరిగిన మొట్టమొదటి ప్రజాస్వామ్య ఎన్నికల అనంతరం నెల్సన్ మండేలాకు పాలనా పగ్గాలు అప్పగించే వరకు ఆఫ్రికా అధ్యక్షునిగానూ పనిచేశారు.

నెల్సన్ మండేలాతో ఎఫ్‌డబ్ల్యూ డీ క్లెర్క్

డచ్ వలసవాదుల కుటుంబానికి చెందిన క్లెర్క్.. జోహన్నెస్‌బర్గ్‌లోని సంపన్న కుటుంబంలో జన్మించారు. శ్వేతజాతీయుల నుంచి దేశ పాలనను నల్లజాతీయులకు అందించే క్రమంలో అందించిన అద్భుత సేవలకు గాను మండేలాతో కలసి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details