మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్ ధుపేలియా (66) కరోనాతో కన్నుమూశారు. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లో నివసించే సతీశ్ కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్నారు. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ సమయంలోనే కరోనా బారిన పడ్డారు.
మూడు రోజుల క్రితమే జన్మదినం జరపుకొన్న సతీశ్ ఆదివారం రాత్రి హఠాత్తుగా గుండేపోటు రావడం వల్ల తుది శ్వాస విడిచినట్లు.. ఆయన సోదరి ఉమా ధుపేలియా మెస్త్రీ తెలిపారు.