టాంజానియా దేశానికి మొదటిసారిగా ఒక మహిళ అధ్యక్ష పదవిని చేపడుతున్నారు. సమియా సులుహు హస్సన్(61) అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. దార్ ఈ-సలాంలో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు.
టాంజానియా తొలి అధ్యక్షురాలిగా సులుహు హాసన్ - టాంజానియా మొదటి మహిళా అధ్యక్షురాలుగా సమియా సులుహు
టాంజానియా దేశ చరిత్రలో మొదటిసారిగా ఒక మహిళ అధ్యక్ష పదవిని చేపడుతున్నారు. సమియా సులుహు హాసన్(61) ఈ ఘనత సాధించారు. ఆ దేశ అతిపెద్ద నగరం దార్ ఈ-సలాంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
టాంజానియా అధ్యక్షురాలుగా మొదటి మహిళ
హిజాబ్ ధరించి..కుడిచేతిలో ఖురాన్‌ను పట్టుకుని తూర్పు ఆఫ్రికా దేశాల చీఫ్ జస్టిస్ సమక్షంలో దేశ రాజ్యాంగంపై సులుహు హాసన్ ప్రమాణం చేశారు. అనంతరం మిలిటరీ పరేడ్‌ను పరిశీలించారు. టాంజానియా మాజీ అధ్యక్షులు అలీ హసన్ మ్విని, జకాయ కిక్వేటే, అబీద్ కరుమె కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కరోనా నిబంధనల నడుమ ఈ కార్యక్రమం జరిగింది.
ఇదీ చదవండి:జులు జాతి రాజు గుడ్‌విల్ జ్వెలిథిని ఇకలేరు