తెలంగాణ

telangana

రహస్య ప్రదేశంలో భారత్​ టీకాలు.. ఎందుకంటే?

By

Published : Jan 11, 2021, 11:36 AM IST

కొత్త రకం కరోనా వైరస్​, కొవిడ్ సెకండ్​ వేవ్​తో దక్షిణాఫ్రికా ఉక్కిరిబిక్కిరవుతోంది. అయితే భారత్​లో సీరం సంస్థ నుంచి 15 లక్షల వ్యాక్సిన్​ డోసులు దక్షిణాఫ్రికా పొందనుంది. వీటిని రహస్య ప్రదేశంలో భద్రపరచనుందట ఆ దేశం. ఎందుకో తెలుసా?

COVID-19
రహస్య ప్రదేశంలో భారత్​ టీకాలు.. ఎందుకంటే?

భారత్​ నుంచి రానున్న కొవిడ్​ 19 వ్యాక్సిన్​ డోసులను దక్షిణాఫ్రికా ఓ రహస్య ప్రదేశంలో భద్రపరచనుంది. దొంగల భయం, బ్లాక్​ మార్కెట్​ వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మీడియా తెలిపింది. కొద్ది వారాల్లోనే భారత్​ నుంచి 15 లక్షల వ్యాక్సిన్​ డోసులు దక్షిణాఫ్రికా అందుకోనుంది.

"వ్యాక్సిన్​కి ప్రస్తుతం చాలా డిమాండ్​ ఉంది. అవి కనుక దొంగిలిస్తే బ్లాక్​ మార్కెట్​ కోరలు చాస్తుంది. వాటి ధరలు ఆకాశాన్నంటుతాయి. అందుకే ఓ రహస్య ప్రదేశంలో వాటిని భద్రపరుస్తాం. అక్కడి నుంచి ఆసుపత్రులు, క్లినిక్​లకు పంపిణీ చేస్తాం. ఇప్పటికే వ్యాక్సినేషన్​ మొదలుపెట్టిన చాలా దేశాల్లో టీకాలు దొంగతనానికి గురయ్యాయని వార్తలు వచ్చాయి. అందుకే అవి ఎక్కడ భద్రపరిచామో తెలియనివ్వం."

- పోపో మాజా, ఆరోగ్యశాఖ ప్రతినిధి

భారత్​ నుంచి సీరం సంస్థ తయారు చేస్తోన్న ఆస్ట్రాజెనకా టీకాను దిగుమతి చేసుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా పార్లమెంట్​లో ఆ దేశ ఆరోగ్యమంత్రి వెల్లడించారు. కరోనా 2.0, కొత్తరకం కొవిడ్​తో ఇప్పటికే దక్షిణాఫ్రికా అతలాకతులం అవుతోంది. కొత్తగా 21,600 కేసులు, 399 మరణాలు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details