ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ సౌజన్యంతో భారత్ సీరం సంస్థ తయారు చేస్తున్న కరోనా టీకా డోసులను దక్షిణాఫ్రికాకు సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. రెండు దశల్లో 15 లక్షల డోసులను భారత్ పంపిణీ చేయనున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి జ్వేలి ఎమ్ఖైజ్ వెల్లడించారు. జనవరిలో 10 లక్షల డోసులు.. ఫిబ్రవరిలో అదనంగా 5 లక్షల వ్యాక్సిన్లు సీరం అందిస్తోందని పేర్కొన్నారు.
దేశంలో ఆరోగ్య పరిస్థితులపై పార్లమెంటు పోర్ట్‌ఫోలియో కమిటీని ఉద్దేశించి మాట్లాడిని ఆయన.. దిగుమతి చేసుకున్న టీకాలను ముందుగా ఫ్రంట్‌లైన్ వైద్య సిబ్బందికి వేస్తామని వెల్లడించారు.