తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎయిర్​పోర్ట్​పై రాకెట్​ దాడి- తాలిబన్ల పనే!

అఫ్గానిస్థాన్​లోని కాందహార్​ విమానాశ్రయంపై రాకెట్ దాడి జరిగింది. ఇది తాలిబన్ల పనేనని అధికారులు భావిస్తున్నారు.

By

Published : Aug 1, 2021, 10:11 AM IST

Updated : Aug 1, 2021, 12:03 PM IST

Rockets
రాకెట్​

అఫ్గానిస్థాన్​లోని కాందహార్​ విమానాశ్రయంపై రాకెట్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ మేరకు ఆ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఇది తాలిబన్ల పనేనని అధికారులు అనుమానిస్తున్నారు.

గత నెలలో ఈద్​ ప్రార్థనల సమయంలో ఆ దేశ అధ్యక్షడి నివాస భవనానికి సమీప ప్రాంతాల్లో మూడు రాకెట్లతో దాడి జరిగింది.

గత కొన్నివారాలుగా అఫ్గాన్​ పౌరులు, రక్షణ, భద్రతా దళాలపై తాలిబన్లు దాడులను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్​ 14 నుంచి 4000 మంది పౌరులు సహా 2,000 వేల మంది పౌరులను పొట్టన పెట్టుకున్నారని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వేలాది మంది గాయపడ్డారని పేర్కొంది.

దేశంలోని 200కు పైగా జిల్లాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే సరిహద్దుల్లోని 10 క్రాసింగ్​ పాయింట్లను హస్తగతం చేసుకున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి:చైనాలో మరిన్ని ప్రాంతాలకు డెల్టా ముప్పు

Last Updated : Aug 1, 2021, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details