తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా వ్యాక్సిన్​పై అనుమానాలా?.. ఇదిగో క్లారిటీ! - covid-19 vaccines in south africa

ఒకవైపు కరోనా వైరస్​ నిరంతరం తన రూపు మార్చుకుంటూ ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడుతున్న క్రమంలో వ్యాక్సిన్లపై ఇప్పటికీ కొంతమందిలో సంశయం వీడలేదు. జ్వరం వస్తుందని కొందరు.. మాకు దాంతో పనిలేదని ఇంకొందరు. ఇలా అపోహలతో, అనవసర భయాలతో వ్యాక్సిన్‌ వేయించుకోవటానికి సంకోచిస్తున్నారు. ఇలాంటి అపోహలకు చెక్​ పెట్టేందుకు ఇద్దరు నిపుణులు ముందుకొచ్చారు. కరోనా వ్యాక్సిన్లకు సంబంధించిన వివరాలు వారి మాటల్లోనే..!

Reluctant to be vaccinated for COVID-19? Here are six myths you can put to rest
వ్యాక్సిన్లపై ఇంకా అనుమానాలా?.. ఈ విషయాలు తెలుసుకోండి!

By

Published : Aug 3, 2021, 1:45 PM IST

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి. మూడో దశ తప్పనిసరి అని ఇప్పటికే వస్తున్న కొవిడ్​ కేసులు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్​ ప్రక్రియను పలు దేశాలు జోరుగా సాగిస్తున్నాయి. సాధ్యమైనంత తర్వాత ప్రజలకు టీకా అందించేందుకు ఇతర దేశాల సహకారాన్ని తీసుకుంటున్నాయి. అయితే కరోనాపై దేశాలు చేస్తున్న పోరాటంలో ప్రజల నుంచి కూడా సహకారం అవసరం.

టీకానే మొదటి ఆయుధం

ఇప్పటికే కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకున్నా ప్రజలు మాత్రం కొన్ని అపోహలు, భయాందోళనలతో ముందుకు రావడం లేదు. అయితే కరోనా కట్టడి చేయడంలో టీకానే మన మొదటి ఆయుధం. వ్యాక్సిన్​ డ్రైవ్​ను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా ఇటీవలే అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించాయి. కొన్ని దేశాల్లో టీకా తీసుకున్న వారికి నిత్యావసర సరకులు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రదేశాల్లోనూ డిస్కౌంట్లను ఆఫర్​ చేస్తున్నారు. ఇలా ఎన్ని చేసినా అధిక శాతం మంది ప్రజలు వ్యాక్సిన్​ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.

భారత్​తో పాటు అనేక దేశాల్లో వ్యాక్సినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతున్నప్పటికీ.. ప్రపంచంలో అనేకమంది ప్రజలు సంశయిస్తున్నారు. కొన్ని అసత్య ప్రచారాల వల్ల టీకా తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. దీని వల్ల కొవిడ్​ మహమ్మారిని ఎదుర్కొవడంలో జాప్యం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ మధ్య కొవిడ్​-19 వ్యాక్సిన్​లపై సోషల్​మీడియాలో వైరల్​ అయిన అపోహలు మీకోసం..

అపోహ 1: కొవిడ్​ వ్యాక్సిన్​ వల్ల గర్భధారణ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందా?

ఫైజర్​లో పనిచేస్తున్న అలర్జీ, శ్వాసకోశ వ్యాధి నిపుణులు, మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వోల్ఫ్​గ్యాంగ్​ వోడార్గ్​తో పాటు ఊపిరితిత్తుల వైద్యనిపుణులు డాక్టర్​ మైఖేల్​ యేడాన్​.. గతేడాది డిసెంబరులో ఓ సోషల్​మీడియా పోస్ట్​ ఈ అపోహకు కారణమైంది. ​

కరోనా వైరస్​పై ఉండే స్పైక్​ ప్రోటీన్.. గర్భధారణ సమయంలో ప్లసెంటా(మావి) వృద్ధి సమయంలో ఉండే స్ప్రైక్​ ప్రోటీన్​ ఒకే పొలికను కలిగి ఉంటాయని వారు పేర్కొన్నారు. అయితే వ్యాక్సిన్​లోని రోగనిరోధక వ్యవస్థ ఆ రెండు ప్రోటీన్లలో తేడాను కనుగొనలేదని వారి వాదన. అందువల్ల కరోనా వైరస్​తో పాటు ప్లసెంటాపై వ్యాక్సిన్​ ప్రభావం పడుతుందని వారు అభిప్రాయపడ్డారు.

అయితే అందులో నిజం లేదు. గర్భధారణకు అవసరమైన ప్లసెంటా ప్రోటీన్​ అనేది కరోనా వైరస్​ స్పైక్​ ప్రోటీన్​కు చాలా వ్యత్యాసం ఉంది. దీనికోసం 23 మంది మహిళా వాలంటీర్లకు ఫైజర్​ వ్యాక్సిన్​ డోసు ఇచ్చిన తర్వాత కూడా గర్భం దాల్చారు. అదే విధంగా కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకోవడం వల్ల గర్భిణిలు సంక్రమణ వ్యాధుల ప్రమాదాన్ని అధిగమించే అవకాశం ఉంది.

అపోహ 2: నాకు కరోనా వైరస్​ సోకింది. అందువల్ల నాకు వ్యాక్సిన్​ అవసరం లేదు!

కొవిడ్​-19కు కారణమైన SARS-CoV-2.. ద్వారా గతంలో వైరస్​ సోకిన వ్యక్తులూ మరోసారి మహమ్మారి బారిన పడే అవకాశం ఉంది. కానీ, టీకా తీసుకోవడం వల్ల వైరస్​ తీవ్రత ఎక్కువగా ఉండదు.

అపోహ 3: కొవిడ్​-19 వ్యాక్సిన్​ పరిణామాలు భయంకరమైనవి?

జోహాన్నెస్​బర్గ్​ విశ్వవిద్యాలయంతో పాటు దక్షిణాఫ్రికాలోని హ్యూమన్​ సైన్సెస్​ రీసెర్చ్​ కౌన్సిల్​ జరిపిన అధ్యయనంలో 25 శాతం మంది కొవిడ్​ వ్యాక్సిన్​ తర్వాత దుష్ప్రభావాల గురించి ఆందోళన చెందుతున్నారని తేలింది.

కరోనా వ్యాక్సిన్​ కారణంగా వచ్చే దుష్ప్రభావాలు చాలా తేలికపాటివి. టీకా తర్వాత తక్కువ గ్రేడ్​ జ్వరం, చేయి నొప్పి, అలసట ఉంటాయి. ఇవి సాధారణంగా ఒకటి లేదా మూడు రోజుల తర్వాత తగ్గిపోతాయి.

రక్తం గడ్డ కట్టడం వంటి అరుదైన దుష్ప్రభావాలు జాన్సన్​ అండ్​ జాన్సన్​ వ్యాక్సిన్​ ద్వారా ఎదురయ్యాయి. అయితే అలాంటి అనుభవాలు ఎదురైంది చాలా తక్కువ. వ్యాక్సిన్​తో పోలిస్తే కరోనా వైరస్​ సోకిన వారిలోనే రక్తం గడ్డ కట్టేందుకు 8-10 రెట్లు అవకాశం ఎక్కువ. అయితే వ్యాక్సిన్​ తర్వాత వచ్చే పరిణామాలపై వైద్యులకు అవగాహన ఉంది. పరిస్థితులకు అనుగుణంగా వారు చికిత్స అందించగలరు.

అపోహ 4: వ్యాక్సిన్లలో మైక్రోచిప్​ ఉంటుంది. అది మనల్ని ట్రాక్​ చేయడం సహా నియంత్రిస్తుంది?

అమెరికాకు చెందిన వ్యాపారవేత్త బిల్​గేట్స్​.. వ్యాక్సిన్ల ద్వారా ప్రజల శరీరాల్లో మైక్రోచిప్​లను పొందుపరచి, వారిని ట్రేస్​ చేయడం సహా వారిని నియంత్రించేందుకు కుట్ర జరుగుతుందోని కొన్ని ఊహాగానాలు వినిపించాయి. ఆ వార్తను బిల్​గేట్స్​ ఖండించారు. వాటిలో నిజం లేదని తేల్చి చెప్పారు.

కొవిడ్​-19 వ్యాక్సిన్​ సిరంజిపై మైక్రోచిప్​ ఉందంటూ ఫేస్​బుక్​లో వైరల్​గా మారిన వీడియో ద్వారా ఈ ప్రచారం జోరందుకుంది. అయితే ఆ వ్యాక్సిన్​ వాడకం జరిగిందా? లేదా ఆ వ్యాక్సిన్​ గడువు ముగిసిందా? అని తెలుసుకునేందుకు ఆ మైక్రోచిప్​ను ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ఆ చిప్​ను వ్యాక్సిన్​ ద్వారా మానవ శరీరంలోకి పంపిస్తారని ప్రచారం జరిగింది. అయితే అది కేవలం వ్యాక్సిన్​ ఉపయోగం జరిగిందా? లేదా? అనేది తెలుసుకునేందుకు మాత్రమే.

అపోహ 5: కొవిడ్​-19 వ్యాక్సిన్​ ఉత్పత్తి హడావుడిగా జరిగింది. కాబట్టి.. దాని ప్రభావం అంతగా ఉండకపోవచ్చు.

కొవిడ్​-19 వ్యాక్సిన్​ను అతితక్కువ కాలంలోనే తయారు చేశారు. అయితే చాలా ఏళ్లుగా జరుగుతున్న టెక్నాలజీలో మార్పు కారణంగా ఇది సాధ్యమైంది. కొవిడ్​కు కారణమైన SARS-CoV-2 వైరస్​ రకాన్ని గుర్తించిన తర్వాత వ్యాక్సినేషన్​ ప్రక్రియను వెంటనే ప్రారంభించారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్​కు కావాల్సిన వనరులు, ఫండ్స్​ లభించడం వల్ల ప్రక్రియ మరింత వేగంవంతమైంది. క్లినికల్​ ట్రయల్స్​ కోసం సోషల్​మీడియా ద్వారా వాలంటీర్లను ఎంచుకున్నారు. SARS-CoV-2 వైరస్​ అనేది అంటువ్యాధి అయిన కారణంగా టీకా పనిచేస్తుందో లేదో అని తక్కువ సమయంలోనే తెలుసుకోగలిగారు.

అపోహ 6: కొవిడ్​-19 వ్యాక్సిన్​ కారణంగా మనలోని డీఎన్​ఏ మారే అవకాశం ఉంది?

ఫైజర్​, జాన్సన్​ అండ్​ జాన్సన్​ వ్యాక్సిన్లు కొవిడ్​-19 వ్యాక్సిన్​ నుంచి శరీరానికి రక్షణ ఇస్తుంది. టీకా తీసుకున్న వ్యక్తిలోని నిరోధక వ్యవస్థ వైరస్​పై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. డీఎన్​ఏ అనేది న్యూక్లియస్​ కణాల కేంద్రకంలో ఉంటుంది. వ్యాక్సిన్​ కణాలలోకి వేయడం లేదు.. కాబట్టి డీఎన్​ఏపై ఎలాంటి మార్పు జరగదు.

సోషల్​మీడియాలో అపోహలు, కుట్ర సిద్ధాంతాలు విపరీతంగా వైరల్​ అవుతూ ఉంటాయి. అందులో ఏదైనా వివరాలను షేర్​ చేసే ముందు శాస్త్రీయంగా నిరూపితమైన వాటినే షేర్​ చేస్తే మంచిది. అలా చేయడం వల్ల రకరకాల అనుమానాలకు తావుండదు.

ఇదీ చూడండి..'ప్రయోగ దశలో మరో ఐదు వ్యాక్సిన్లు'

ABOUT THE AUTHOR

...view details