తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇళ్లపై కుప్పకూలిన విమానం.. 29 మంది మృతి

మధ్య ఆఫ్రికా దేశం డెమోక్రటిక్​ రిపబ్లిక్​ ఆఫ్​ కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్నపాటి విమానమొకటి కూలి 29 మంది మృతి చెందారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కుప్పకూలిన విమానం.. 29 మంది మృతి!

By

Published : Nov 25, 2019, 6:34 AM IST

Updated : Nov 25, 2019, 8:17 AM IST

మధ్య ఆఫ్రికా దేశం డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (డీఆర్‌ కాంగో)లో చిన్నపాటి విమానమొకటి ఇళ్లపై కుప్పకూలింది. ఈ ఘటనలో 29 మృతదేహాలను గుర్తించారు.

ఇళ్లపై కుప్పకూలిన విమానం..

ప్రమాద సమయంలో 17 మంది ప్రయాణికులు, ఇద్దరు విమాన సిబ్బంది మొత్తం 19 మంది విమానంలో ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడినట్లు దాఖలాల్లేవని అధికారులు పేర్కొన్నారు.

గోమా ఎయిర్‌పోర్ట్‌ నుంచి బిజీ బీ విమానయాన సంస్థకు చెందిన డోర్నియర్‌ -228 విమానం బెనీకి బయల్దేరింది. గాల్లోకి లేచిన కాసేపటికే నివాస ప్రాంతంలో కుప్పకూలిపోయింది.

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగింది. సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:ఫడణవీస్​ ప్రభుత్వంపై నేడు సుప్రీంకోర్టు స్పష్టత!

Last Updated : Nov 25, 2019, 8:17 AM IST

ABOUT THE AUTHOR

...view details