తెలంగాణ

telangana

ETV Bharat / international

దక్షిణాఫ్రికా వారసత్వ ప్రదేశంగా.. గాంధీ నడయాడిన ఫీనిక్స్!

మహాత్మా గాంధీ 151వ జన్మదిన సందర్భంగా.. ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌ను జాతీయ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది దక్షిణాఫ్రికా ప్రభుత్వం. ఆ ప్రదేశం మహాత్మా గాంధీ విలువలకు నెలవుగా పేర్కొంది.

Phoenix Settlement declared National Heritage Site in south africa  on the occation of the gandhi's 151st birth anniversery
దక్షిణాఫ్రికా వారసత్వ ప్రదేశంగా.. గాంధీ నడయాడిన ఫీనిక్స్!

By

Published : Oct 3, 2020, 4:58 PM IST

మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా దక్షిణాఫ్రికా, డర్బన్‌లోని ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌ను జాతీయ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. ఈ ప్రకటనను స్వాగతించారు భారత హైకమిషనర్ జైదీప్ సర్కార్.

అక్టోబర్​ 2న గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించింది దక్షిణాఫ్రికా.

ఫీనిక్స్​లో మహత్మా గాంధీ ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. సత్యాగ్రహంతో తన ప్రయోగాలను ప్రారంభించి తన వార్తాపత్రిక 'ఇండియన్ ఒపీనియన్'ను సెటిల్​మెంట్​ నుంచే ప్రచురించేవారు. కాబట్టి ఈ స్థలాన్ని గాంధీ ఆలోచనలకు నెలవుగా ప్రకటించింది దక్షిణాఫ్రికా ప్రభుత్వం.

"ఈ ప్రకటన భారత్-దక్షిణాఫ్రికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఆ ప్రదేశాన్ని సంరక్షించడం వల్ల గాంధీ వారసత్వం, ఆలోచనలు, విలువలను కూడా కాపాడుకున్నట్లు అవుతుంది. భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తినిస్తుంది."

-దక్షిణాఫ్రికా ప్రభుత్వం.

ఇదీ చదవండి: 'నవాజ్​ను తిరిగి రప్పించే ప్లాన్ వేయండి!'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details