కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(South african variant).. ప్రపంచ దేశాలను మళ్లీ వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూసిన ఈ వైరస్.. వివిధ దేశాలకు విస్తరిస్తోంది. ఇది డెల్టా వేరియంట్ కంటే వ్యాప్తి చెందగలదన్న ఆందోళనల మధ్య ఈ వైరస్ కట్టడికి వివిధ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వేరియంట్ గురించి తొలిసారి అప్రమత్తం చేసిన దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఛైర్పర్సన్ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జే(South africa doctor omicron).. ఈ వేరియంట్ సోకిన బాధితుల్లో ఉండే లక్షణాల(Omicron variant syptoms) గురించి కీలక విషయాలు వెల్లడించారు.
కరోనా సోకిన వారికి రుచి, వాసన కోల్పోవడం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం వంటివి సాధారణ లక్షణాలు. కానీ, ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల్లో.. రుచి, వాసన కోల్పోవడం లేదని ఏంజెలిక్ తెలిపారు. తీవ్రమైన అలసట, నాడీ వేగం అధికంగా ఉండటం వంటి అసాధారణ లక్షణాలు(Unusual symptoms of covid 19) ఉంటున్నాయని చెప్పారు. ఈ లక్షణాలు కూడా స్వల్పంగానే ఉన్నాయని వెల్లడించారు.
వైద్య రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న ఏంజెలిక్... ఈ నెల ప్రారంభంలో తన కుటుంబంలోని నలగురు కరోనా బాధితులకు చికిత్స అందిస్తుండగా... వారిలో లక్షణాలు విభిన్నంగా ఉండడం గమనించారు. అనంతరం నవంబరు 18న దక్షిణాఫ్రికా వ్యాక్సిన్ అడ్వైజరీ కమిటీకి విషయాన్ని తెలియజేశారు. అనంతరం కొత్త వేరియంట్ బయటపడినట్లు తేలింది.
"ఓ ఆరేళ్ల వయసు ఉన్న చిన్నారికి కరోనా సోకింది. ఆ పాపకు శరీర ఉష్ణోగ్రత పెరగడం, నాడీ వేగం అధికంగా వంటి లక్షణాలు ఉన్నాయి. ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోవాలా? వద్దా? అని నేను ఆశ్చర్యపోయాను. రెండు రోజుల తర్వాత ఆమెన పరిశీలిస్తే ఆమె పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది."
-ఏంజెలిక్ కోయెట్జె, దక్షిణాఫ్రికా వైద్యురాలు.
ఒమిక్రాన్ సోకిన బాధితులకు తాను చికిత్స అందిస్తుండగా.. వారంతా బాగా కోలుకుంటున్నారని ఏంజెలిక్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:' 'ఒమిక్రాన్' డెల్టా కంటే డేంజర్ అని ఇప్పుడే చెప్పలేం'