ఆఫ్రికాలో 2021 సంవత్సరంలో కోటి మందికిపైగా చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతారని యూనిసెఫ్ (యునైడెట్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) అంచనా వేసింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, నైజీరియా, దక్షిణ సూడాన్, యెమెన్ దేశాలు సహా సెంట్రల్ సహేల్ ప్రాంతాలను ఆ జాబితాలో పేర్కొంది.
ప్రస్తుతం సెంట్రల్ సహేల్ మినహా మిగతా ప్రాంతాలు అన్నీ తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని తెలిపింది.
"ఇప్పటికే ఆహార సంక్షోభంలో ఉన్న దేశాలకు కొవిడ్ 19 తీవ్ర విపత్తు దాపురించేలా చేసింది. ఆహారం కోసం ప్రజలు పడుతున్న ఇక్కట్లు ఇప్పటికే తారస్థాయికి చేరుకున్నాయి. 2020 బాధితులుగా మనం వారిని వదిలేయలేం."