తెలంగాణ

telangana

ETV Bharat / international

మసీదులో కాల్పులు.. 18 మంది దుర్మరణం - నైజీరియా వార్తలు తాజా

నైజీరియాలో కాల్పులు (Nigeria killing News)కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు పాల్పడిన దుండగులు ఫులానీ తెగకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు.

nigeria
మసీదులో కాల్పులు.. 18 మంది దుర్మరణం

By

Published : Oct 26, 2021, 10:24 AM IST

Updated : Oct 26, 2021, 11:46 AM IST

ప్రార్ధనల కోసం మసీదుకు వచ్చిన వారిపై కాల్పులు (Nigeria killing News) జరిపి పలువురిని హతమార్చారు దుండగులు. ఈ కాల్పుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోగా నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర నైజీరియాలోని మజాకుకా గ్రామంలో సోమవారం జరిగింది. దాడికి పాల్పడిన వారు (Nigeria killing News) ఫులానీ తెగకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు. పరారీలో ఉన్న దుండగుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

స్థానికులు, ఫులానీ వర్గాల మధ్య ఉన్న విభేదాలు.. ఈ కాల్పులకు (Nigeria killing News) కారణమని అధికారులు వెల్లడించారు. నీరు, భూమికి సంబంధించి గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య అంతర్గత పోరు నడుస్తోందని పేర్కొన్నారు.

వారం రోజుల క్రితం కూడా ఇదే తరహా ఘటన జరిగింది. సొకోటో రాష్ట్రంలో దుండగలు గ్రామస్థులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

అగ్రరాజ్యంలోనూ..

అమెరికాలోని ఇదహో రాష్ట్ర రాజధాని బోయిస్​లో సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం) జరిగిన కాల్పుల ఘటనలో ఓ పోలీస్​ సహా మరో వ్యక్తి మృతిచెందారు. నలుగురు గాయపడ్డారు. ఓ షాపింగ్​ మాల్​లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించలేదు.

ఇదీ చూడండి :సుడాన్​లో సైనిక తిరుగుబాటు- ప్రధాని అరెస్ట్​!

Last Updated : Oct 26, 2021, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details