దక్షిణ సుడాన్ రాజధాని జుబాలో కార్గో విమానం కూలింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. కూలిన విమానం ఆప్టిమమ్ ఏవియేషన్ లిమిటెడ్‌కు చెందినదిగా గుర్తించారు.
కూలిన విమానం.. ఐదుగురు దుర్మరణం - సూడాన్‌లో విమనం కూలి ఐదుగురు మృతి
దక్షిణ సుడాన్లో విమానం కూలి ఐదుగురు చనిపోయారు. రాజధాని జుబా నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
![కూలిన విమానం.. ఐదుగురు దుర్మరణం Official: 5 killed when cargo plane crashes in South Sudan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13531967-thumbnail-3x2-attack.jpg)
కూలిన విమానం.. ఐదుగురు దుర్మరణం
జుబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. చనిపోయిన ఐదుగురులో పైలెట్‌తో పాటు సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. వారిలో ఇద్దరు రష్యాకు చెందిన వారు కాగా.. మిగతావాళ్లు దక్షిణ సుడాన్‌కు చెందిన వారని చెప్పారు.
విమానం ప్రమాదానికి గురైనప్పుడు అందులో ఇంధనం కూడా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి.
Last Updated : Nov 2, 2021, 9:26 PM IST