తెలంగాణ

telangana

ETV Bharat / international

విమాన ప్రమాదంలో నైజీరియా సైన్యాధిపతి మృతి - నైజీరియాలో నేలకూలిన విమానం

నైజీరియాలో విషాదకర ఘటన జరిగింది. విమానం నేలకూలిన ప్రమాదంలో ఆ దేశ సైన్యాధిపతి జనరల్​ ఇబ్రహీమ్​ అట్టహిరు సహా మరో 10 మంది శుక్రవారం మృతి చెందారు.

palne crash
విమాన ప్రమాదం

By

Published : May 23, 2021, 6:21 AM IST

విమానం నేలకూలిన ప్రమాదంలో నైజీరియా సైన్యాధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ ఇబ్రహీమ్‌ అట్టహిరుతో పాటు మరో 10 మంది శుక్రవారం మృతి చెందారు. వాతావరణం సరిగా లేకపోవటం వల్ల.. కొందరు సైనికాధికారులతో కలిపి ఆయన ప్రయాణిస్తున్న విమానం నైజీరియా ఉత్తర ప్రాంతాన ఉన్న కడునా విమానాశ్రయం వద్ద నేలకూలినట్లు సైన్యం తెలిపింది.

ఈ దుర్ఘటనలో మృతిచెందినవారిలో కొందరు సైనికాధికారులు, విమాన సిబ్బంది ఉన్నట్లు సైన్యం పేర్కొంది. అయితే విమానం నేలకూలడానికి గల స్పష్టమైన కారణాలేమిటన్నది తెలియరాలేదు.

ABOUT THE AUTHOR

...view details