తెలంగాణ

telangana

ETV Bharat / international

కూలిన సైనిక విమానాలు.. 9 మంది మృతి

నైజీరియా రాజధాని అబుజా విమానాశ్రయం సమీపంలో ఓ సైనిక విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అలబామాలో ఓ శిక్షణ విమానం కూలిపోయి ఇద్దరు మృతి చెందారు.

Plane crash
కూలిన మిలిటరీ విమానాలు

By

Published : Feb 22, 2021, 5:33 AM IST

నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని అబుజా​లోని విమానాశ్రయానికి సమీపంలో ఓ సైనిక విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

అబుజా విమానాశ్రయం నుంచి కింగ్​ ఎయిర్​-350 విమానం మిన్నా నగరానికి వెళ్లేందుకు బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే దాని ఇంజిన్​లో సమస్య తలెత్తింది. దాంతో విమానాన్ని వెనక్కి మళ్లించిన క్రమంలో ప్రమాదం జరిగినట్లు నైజీరియా వైమానిక దళ ప్రతినిధి ఇబికున్లే దరమోలా తెలిపారు. విమాన ప్రమాదంలో అందులోని మొత్తం మంది మరణించినట్లు ట్వీట్​ చేశారు. మరోవైపు.. ఈ ఘటనపై సైన్యం దర్యాప్తు చేపట్టునుందని విమానయాన మంత్రి హాది సిరికా తెలిపారు.

అమెరికాలో..

అమెరికాలోని అలబామాలో వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో శిక్షకుడు సహా జపాన్​ ఎయిర్​ సెల్ఫ్​ డిఫెన్స్​ ఫోర్స్​కు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

ఇదీ చూడండి:మయన్మార్: యువతి మృతితో ఆందోళనలు ఉద్ధృతం

ABOUT THE AUTHOR

...view details