నైజీరియా ఉత్తర బోరో రాష్ట్రంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో దాదాపు 40 మంది రైతులు మరణించారు. గరిన్-వాషిబి ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రాల్లో ముష్కరులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
మృతుల్లో మత్స్య కారులు సైతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బోకో హారమ్ ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ స్పందించారు. ఉగ్రమూకల నుంచి దేశాన్ని రక్షించేందుకు సైన్యానికి అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టంచేశారు.