దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా వైరస్‌ను గుర్తించామని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి జ్వేలి మఖాయిజ్ పేర్కొన్నారు. ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని, దేశంలో రెండో విడత మహమ్మారి విజృంభణను ఇది తీవ్రం చేస్తోందని తెలిపారు. ఈ కొత్త రకం వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని, అయితే ఆందోళన చెందవద్దని ప్రజలకు సూచించారు. ఆరోగ్యపరంగా ఎలాంటి రుగ్మతలు లేనివారిపైన, యువతపైన కూడా కరోనా వైరస్ ఇటీవల ప్రభావం చూపుతోందని మఖాయిజ్ చెప్పారు.
దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా - new starin of corona virus
కొత్తరకం కరోనా వైరస్‌ను గుర్తించామని దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ మంత్రి జ్వేలి మఖాయిజ్ వెల్లడించారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ మహమ్మారి విజృంభణను మరింత తీవ్రం చేస్తోందని తెలిపారు.
దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా
కొత్త రకం కరోనా వైరకు '501.వీ2' అని పేరు పెట్టామని తెలిపారు ముఖాయిజ్. తమ దేశ జన్యుశాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారన్నారు. అయితే మొదటి రకం కరోనా వైరస్ కన్నా ఇది తీవ్ర అనారోగ్యం కలిగిస్తుందని ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు తెలిపారు. కొవిడ్ నుంచి కోలు కున్నవారిలో తిరిగి ఇన్ ఫెక్షన్లను కలిగిస్తుందా అన్నదాని పైనా ఇప్పుడే నిర్ధరణ చేయలేమని వివరించారు.
ఇదీ చూడండి :కరోనాతో పాటు ఈ సమస్యలు ఉంటే.. ఇక అంతే!