దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ రకం(south africa covid variant) మరింత ప్రమాదకరంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. దక్షిణాఫ్రికాలో తొలిసారి గుర్తించిన సీ.1.2 రకం కరోనా(c.1.2 variant).. వ్యాక్సిన్ నుంచి లభించిన రక్షణను ఎదిరించి మరీ వ్యాపిస్తున్నట్లు వెల్లడైంది. దక్షిణాఫ్రికాకు చెందిన జాతీయ అంటువ్యాధుల సంస్థ(ఎన్ఐసీడీ), క్వాజులు-నేటల్ రీసర్చ్ ఇన్నోవేషన్స్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్‌ఫాం(క్రిస్ప్) సంస్థల శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు.
అధిక మ్యుటేషన్
సీ.1.2 రకం కరోనా కేసులు చైనా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మారిషస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్ దేశాల్లో బయటపడ్డాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దక్షిణాఫ్రికాలో కరోనా ఫస్ట్ వేవ్‌లో తీవ్ర ప్రభావం చూపించిన సీ.1 రకంతో పోలిస్తే సీ.1.2 వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉందని చెప్పారు. ఆందోళనకర వేరియంట్, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో పోలిస్తే సీ.1.2లో మ్యుటేషన్లు అధికంగా ఉన్నాయని వివరించారు.
సీ.1.2 మ్యుటేషన్ రేటు 41.8 శాతం ఉందని తెలిపారు. అంటే, సంవత్సరానికి 41.8 సార్లు వైరస్‌లో మార్పులు సంభవిస్తాయని అర్థం. ప్రస్తుతం ఉన్న వైరస్ వేరియంట్ల మ్యుటేషన్ రేట్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం ఆందోళనకరం.
ఈ వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం స్పందనతో పాటు.. భారత్‌లో ఈ వేరియంట్ కేసులు ఎన్నికేసులు నమోదయ్యాయనే విషయం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్చేయండి..